Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తేపురం కల్వర్టు పూర్తి.. రైతుల్లో హర్షం

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 11:21 AM ఏలూరుGeneral
పత్తేపురం కల్వర్టు పూర్తి.. రైతుల్లో హర్షం - Udayam
ఉంగుటూరు మండలం రావులపర్రు వద్ద పత్తేపురం పంట కాలువపై కల్వర్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో రాకపోకలకు మార్గం సుగమమైంది. దశాబ్దాలుగా ఉన్న సమస్యను ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు చొరవతో పరిష్కరించినట్లు తెలిపారు. కాలువపై వంతెన లేక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కల్వర్టు నిర్మాణం పూర్తికావడంతో రాకపోకలకు ఇబ్బందులు తొలగాయని, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...