వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకులో ఈనెల 12, 13 తేదీల్లో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో జి.శివడకు చెందిన గిరిజన క్రీడాకారుడు కె.మోహన్‌రావు రెండు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం సాధించారు. షాట్‌పుట్, హ్యామర్ త్రోలో స్వర్ణాలు, జావెలిన్ త్రోలో కాంస్యం గెలిచారు.
జి.శివడ ఎంపీపీ పాఠశాలలో సవర భాష వాలంటీర్‌గా పనిచేస్తున్న మోహన్‌రావు ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ రాణిస్తున్నారు. ఆయనను ప్రభుత్వం ప్రోత్సహించాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.
Comments
Loading comments...

