వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మాదాపూర్ లో గురువారం పశువులకు ఉచితంగా నట్టల నివారణ మందులు వేశారు. పశువైద్యాధికారి పండరి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులు తమ పశువులను తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నట్టల నివారణ మందులు వేయించడం ద్వారా పశువులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాయని పండరి తెలిపారు.
కార్యక్రమంలో సర్పంచ్ బుక్కావార్ ఆశ, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

