వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తున్న పశువుల నియంత్రణకు నగరపాలక సంస్థ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. కమిషనర్ జి. శ్రావణ్ కుమార్ ఆదేశాలతో MHO డా పి సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
రోడ్లపై సంచరిస్తున్న పశువులను పట్టుకుని కాజీపేటలోని పశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. పశువులను రోడ్లపై వదిలే యజమానులపై భారీ జరిమానా, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

