Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశువైద్య కేంద్రలో జేడి , ఏడీ ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 18, 2026 4:02 PM విజయనగరంGeneral
పశువైద్య కేంద్రలో జేడి , ఏడీ ఆకస్మిక తనిఖీలు - Udayam
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బోనంగి పశువైద్య కేంద్రాన్ని శుక్రవారం వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ మన్మధరావు, అసిస్టెంట్ డైరెక్టర్ రెడ్డి కృష్ణ ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు కేంద్రంలో అందుతున్న సేవలు, సిబ్బంది పనితీరు , నిర్వహణ తీరును వారు పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి, పశువులకు అందిస్తున్న వైద్య సేవలు, మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి, అదికారులకు పలు సూచనలు చేసారు

Comments

G
Loading comments...