వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం కోరుకొల్లు వద్ద మద్యం మత్తులో ముగ్గురు యువకులు కారుతో బీభత్సం సృష్టించారు. ఉండి ఇన్‌చార్జ్ యోగేంద్ర కుమార్ కారును, మొగల్లు వద్ద ఇద్దరిని, విష్ణు కాలేజ్ వద్ద ఆటోను వరుసగా ఢీకొట్టారు.
గొల్లలపేట వద్ద స్థానికులపైకి కారుతో దూసుకెళ్లి భీమవరం పారిపోయారు. కొవ్వాడ బైపాస్ వద్ద డీజిల్ అయిపోవడంతో కారు ఆగగా, స్థానికులు ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Comments
Loading comments...

