వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 15 వ వార్డు కౌన్సిలర్ గోప సుజాత చిన్న రమేష్ కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వార్డు ప్రజలకు కౌన్సిలర్ మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాలతో ప్రకృతికి హాని జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

