వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పోటీ చేయాలని, ఏ స్థానమూ పోటీ లేకుండా ఏకగ్రీవం కాకూడదని పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ పరిశీలకులతో నిర్వహించిన టెలి సమావేశంలో దిశానిర్దేశం చేశారు.
సమయం తక్కువగా ఉన్నందున అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు, ప్రచారం సమాంతరంగా చేపట్టాలని సూచించారు. రానున్న 15–20 రోజులు పరిశీలకులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని కోరారు.
Comments
Loading comments...

