వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడేందుకు రాజ్యాంగపరమైన రక్షణలు అవసరమని మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ అన్నారు. కేరళలో జరిగిన న్యాయవాదుల సదస్సులో ఆయన మాట్లాడారు.
ఎన్నికల కమిషనర్ల నియామకాలు, సర్వీసు నిబంధనలకు రాజ్యాంగ భద్రత కల్పించాలని సూచించారు. వారిని తొలగించే ప్రక్రియ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తరహాలో ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణపై ప్రజల విశ్వాసం కీలకమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

