Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జౌళి రంగ అభివృద్ధికి బ్రిటన్‌ సంస్థలతో తెలంగాణ ఒప్పందాలు

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 10:51 PM హైదరాబాద్General
జౌళి రంగ అభివృద్ధికి బ్రిటన్‌ సంస్థలతో తెలంగాణ ఒప్పందాలు - Udayam
తెలంగాణ జౌళి రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసేందుకు బ్రిటన్‌కు చెందిన రెండు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హడర్స్‌ఫీల్డ్‌ విశ్వవిద్యాలయం, టెక్స్‌టైల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌తో కుదిరిన ఒప్పందాల ద్వారా పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తామన్నారు.

Comments

G
Loading comments...