వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి ఎలివేటెడ్ కారిడార్ కోసం ఇళ్లు కోల్పోతున్న 35 కుటుంబాలు తమకు కేటాయించిన స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటం గ్రామంలో వారికి సెంటున్నర చొప్పున స్థలాలు కేటాయించారు.
రోడ్లు, విద్యుత్ లేకుండానే ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. సదుపాయాలు కల్పించిన తర్వాతే ఇళ్లు ఖాళీ చేస్తామని వారు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

