వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక ధరలను అరికట్టాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో సీపీఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఫైర్‌స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు.
అనంతరం ధర్నా నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిత్యావసర సరుకులు, హోటల్ ధరలను నియంత్రించాలని కోరుతూ డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

