Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొలమద్దిలో యూరియా కోసం ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 4:28 PM రాజన్న సిరిసిల్లGeneral
కొలమద్దిలో యూరియా కోసం ధర్నా - Udayam
గంభీరావుపేట మండలం కొలమద్ది గ్రామంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ నాయకులు, రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. సర్పంచ్ దిలీప్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. సకాలంలో యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దిలీప్ తెలిపారు. పంటకు సరైన సమయంలో యూరియా అందకపోతే దిగుబడి తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...