వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో శ్రీ కాళికామాత బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి పట్టు వస్త్రాలు, ఆభరణాలను గ్రామ వీధుల్లో ఊరేగించారు.
గ్రామ పెద్దల ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ గ్రామంలోని బొడ్రాలకు అభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రామచంద్రయ్య యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ గుంత మల్లేష్, వార్డు సభ్యులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

