వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట మండలం దుగ్గి-రాయిలంకకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు శిథిలావస్థకు చేరింది. దీంతో వాహనదారులు, గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్వర్టు దెబ్బతినడంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి కల్వర్టును పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

