వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా తెర్లాం MPP కార్యాలయంలో MPDO రేగి రంబాబు సోమవారం మండలంలోని 33 గ్రామ పంచాయతీలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల అధికారిక జాబితాను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల పరిశీలన కోసం జాబితాను నోటీసు బోర్డులో ప్రదర్శించినట్లు తెలిపారు.ఈ మేరకు ఆయా గ్రామ పంచాయతీల ఓటర్లు జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

