వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని మల్లాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ప్రజల సమస్యలపై కాళోజీ చేసిన కృషి చిరస్మరణీయమని సర్పంచ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గడ్డం సోమరెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

