వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ రాజన్న ఆలయ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను స్థానిక నిరుద్యోగులకే కేటాయించాలని బీఆర్ఎస్ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు. మంత్రుల సిఫారసులతో దొడ్డిదారిలో భర్తీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
పారదర్శకంగా నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేపట్టాలని, ఇప్పటికే జరిగిన నియామకాలపై విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

