Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి పట్టణంలో వెలిగిన వీధిదీపాలు

Follow Udayam on Google
ch. anji Sep 05, 2026 7:35 PM వికారాబాద్General
పరిగి పట్టణంలో వెలిగిన వీధిదీపాలు - Udayam
పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు లో ప్రజల చీకటి కష్టాలు తొలగిపోయాయి. వార్డు పరిధిలోని అనంత్ రెడ్డి నగర్ కాలనీ, నిజాం కాలనీలలో మున్సిపల్ కౌన్సిలర్ సరిత ఆంజనేయులు ప్రత్యేక చొరవతో నూతన వీధిలైట్లను ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా ఈ కాలనీల్లో వీధిదీపాలు లేకపోవడంతో స్థానికులు, ముఖ్యంగా మహిళలు, రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్యను గుర్తించిన కౌన్సిలర్ సరిత ఆంజనేయులు పరిష్కరించారు.

Comments

G
Loading comments...