వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లాలో 112 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైన పూర్వ ప్రాథమిక తరగతులకు శిక్షకులు, ఆయాల నియామకం ఇంకా పూర్తికాలేదు. దీంతో ప్రస్తుతం ఉపాధ్యాయులే చిన్నారులకు బోధిస్తున్నారు.
ఈ తరగతుల్లో 868 మంది విద్యార్థులు చేరగా, విద్యా సామగ్రి, మౌలిక వసతుల కల్పనలో ఆలస్యం జరుగుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...
