Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన

Follow Udayam on Google
Md. Areef Oct 02, 2026 1:49 PM వనపర్తిGeneral
ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన - Udayam
అమరచింత మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని హై స్కూల్ విద్యార్థులతో కలిసి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.డి.కుతుబ్ నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో మంత్రి వాకిటి శ్రీహరి కళాశాలపై హామీ ఇచ్చారని కానీ ఇప్పటివరకు జూనియర్ కళాశాల ఏర్పాటు చేయలేదన్నారు. మంత్రిగారు వెంటనే స్పందించి జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...