Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ సేవా పథకం దినోత్సవం

Follow Udayam on Google
Chitty Ramesh Sep 24, 2026 4:41 PM మంచిర్యాలGeneral
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ సేవా పథకం దినోత్సవం - Udayam
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం జాతీయ సేవా పథకం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ శంకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు అందరూ ఎన్ఎస్ఎస్ లో వాలంటీర్లుగా చేరి సేవా మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో జాతి సేవలో పాల్గొంటామని ప్రతిజ్ఞ చేయించి, సర్టిఫికెట్ లు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...