వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి మండలం బొంపల్లి ప్రభుత్వ భూమిలో సాగుతున్న అక్రమ పేలుళ్లు గ్రామంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. హైటెన్షన్ విద్యుత్ తీగల కిందే ప్రమాదకరంగా బ్లాస్టింగ్‌లు చేస్తుండటంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.
ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

