వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా నాణ్యమైన సేవలు అందించాలని ట్రైనీ కలెక్టర్ సురేష్ పామూరి సూచించారు.
పీహెచ్‌సీ వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మాతా శిశు మరణాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఏఎన్‌ఎంలు, ఆశాలు గృహ సందర్శనలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ బి. రాజశ్రీ, వైద్యాధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

