వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో స్పందించారు. "మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర.. కానీ సింగిల్‌గా వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా?" అంటూ పరోక్షంగా వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు.
దీనిపై నిర్మాత బండ్ల గణేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతి ఊరి విషయంలో, ప్రతి సమస్యలో జోక్యం చేసుకుని జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి మీరేమైనా కలెక్టరా లేక దేశ ప్రధానా అని ప్రశ్నించారు. ముందు మీ సంగతి మీరు చూసుకుని, ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయాలంటూ హితవు పలికారు.
Comments
Loading comments...

