వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు పొందుతున్న ప్రజల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆసుపత్రి నిర్వహణపై ఆరా తీశారు.
ఆస్పత్రి నిర్వహణ అనుమతి పత్రాలను, రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలన్నారు.
Comments
Loading comments...

