Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో వెంకట్

Follow Udayam on Google
Ch. Anji Oct 01, 2026 9:00 AM వికారాబాద్General
ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో వెంకట్ - Udayam
దోమ మండల పరిధిలోని ఇలాబాద్ తండా లో ప్రాథమిక పాఠశాలను బుధవారం మండల విద్యాశాఖాధికారి (MEO) వెంకట్ సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల పరిసరాలను పరిశీలించి, తరగతి గదుల్లో ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి అభ్యసన స్థాయిలను, చదువులో ప్రతిభను పరీక్షించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

Comments

G
Loading comments...