Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 31, 2026 2:57 PM నాగర్ కర్నూల్General
ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ - Udayam
ఊర్కొండ మండల పరిధిలోని ఊర్కొండపేట ప్రాథమిక పాఠశాలను సోమవారం MEO అబ్దుల్ రహీం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను సమగ్రంగా పరిశీలించిన ఆయన, మధ్యాహ్న భోజన అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలు, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు. బోధనలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Comments

G
Loading comments...