వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పరారైన పోక్సో కేసు నిందితుడు అడిగర్ల భాను ప్రకాశ్‌ను తుని రూరల్ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేసినట్లు SI కృష్ణమాచార్యులు తెలిపారు.
శనివారం తుని సబ్‌జైలు నుంచి వైద్య పరీక్షల కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సమయంలో భాను ప్రకాశ్ పరారయ్యాడు. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. బెంగళూరులో అదుపులో తీసుకొని తునికి తీసుకొచ్చినట్లు SI తెలిపారు.
Comments
Loading comments...

