Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోస్టల్ ఓట్లలో పలు చోట్ల టీడీపీ ఆధిక్యం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 11:23 AM అమరావతిGeneral
పోస్టల్ ఓట్లలో పలు చోట్ల టీడీపీ ఆధిక్యం - Udayam
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీడీపీ పలు ప్రాంతాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. దాదాపు 99 శాతం మున్సిపాలిటీల్లో టీడీపీ ముందంజలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లలోనూ ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు ఉయ్యూరు, పెడనలో వైసీపీ, తిరువూరు, మడకశిర, అమలాపురం, నర్సాపురంలో జనసేన ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...