Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలం బడిలో రైతులకు సాగుపై అవగాహన

Follow Udayam on Google
బాలాజీ Aug 09, 2026 9:12 PM సంగారెడ్డితెలంగాణ
పోలం బడిలో రైతులకు సాగుపై అవగాహన - Udayam
జహీరాబాద్ నియోజకవర్గం, గుమ్మసంగం మండలం సిద్దాపూర్ గ్రామంలో పోలం బడి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్త రమేష్, ఏటీఎం సుకుమార్, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. వానాకాలం సీజన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువులు, పురుగుమందుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయంతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి వివరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సర్పంచ్, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...