వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం రూరల్ మండలం తండేంవలస పోలీస్ శిక్షణ కేంద్రంలో 142 మంది సివిల్ కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ మంగళవారం జరిగింది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పోలీసులు నిజాయితీ, నిష్పక్షపాతంగా ప్రజల హక్కులను గౌరవిస్తూ సేవ చేయాలని పిలుపునిచ్చారు.
మహిళా భద్రత, డ్రగ్స్ నిరోధం, రోడ్ సేఫ్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

