Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 03, 2026 10:36 AM గుంటూరుGeneral
పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం - Udayam
పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక అపహరణకు గురై మూడు నెలలు గడుస్తున్నా ఆచూకీ కనిపెట్టకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం పోలీసుల పూర్తి వైఫల్యమేనని మండిపడింది. దర్యాప్తును స్థానిక పోలీసులకే అప్పగించాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా, ఎస్పీ, ఎస్హెచ్‌ఓలపై తమకు నమ్మకం లేదని కోర్టు స్పష్టం చేసింది. అపహరణకు గురైన బాలికను గురువారం తమ ముందర హాజరుపరచాలని డీజీపీని ఆదేశించింది.

Comments

G
Loading comments...