వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ ను సీపీ పి.సాయి చైతన్య మంగళవారం తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, ఫిర్యాదుల పరిష్కారం, రికార్డులను పరిశీలించారు. మహిళలు, బాలికల ఫిర్యాదులపై త్వరగా స్పందించి, బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.
పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాశ్ యాదవ్, ఇన్స్పెక్టర్ శ్రీలత, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు
Comments
Loading comments...

