Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరులో పింఛన్ల పంపిణీ పరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:15 AM గుంటూరుGeneral
పొన్నూరులో పింఛన్ల పంపిణీ పరిశీలన - Udayam
పొన్నూరు పురపాలక సంఘ కమిషనర్ ముప్పాళ్ల రమేశ్ బాబు గురువారం పట్టణంలో పర్యటించారు. వార్డులో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, పంపిణీ తీరును పరిశీలించారు. పింఛన్‌దారులకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం వార్డులో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...