Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరులో భారీ చోరీ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 30, 2026 10:56 AM గుంటూరుGeneral
పొన్నూరులో భారీ చోరీ - Udayam
పొన్నూరు షరాఫ్ బజార్‌లో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. స్థానిక వ్యాపారి కొల్లిపర సుబ్బారావు ఇంట్లోకి చొరబడిన దుండగులు 16 సవర్ల బంగారం, 3 కిలోల వెండిని దోచుకెళ్లారు. కుమార్తె పెళ్లి కోసం కూడబెట్టిన సొత్తు దొంగలపాలవ్వడంతో ఆ కుటుంబం తీవ్ర విచారంలో మునిగిపోయింది. బాధితుల ఫిర్యాదుతో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...