Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొంగిపొర్లుతున్న గుబేలుగెడ్డ

Follow Udayam on Google
Ganga Sep 25, 2026 10:41 AM పార్వతీపురం మన్యంGeneral
సాలూరు మండలం దేవు బుచ్చంపేట-పెడబొరబంద గ్రామాల మధ్య గుబెలుగెడ్డ పొంగి పొర్లుతోంది. గురువారం కురిసిన భారీ వర్షానికి గెడ్డ ఉద్ధృతంగా ప్రవహించడంతో పెడబొరబంధ, చిన్నబొరబంధ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు తెలిపారు. బుచ్ఛంపేట సమీపంలోకి వరదనీరు చేరిందన్నారు. అధికారులు స్పందించి శాశ్వతంగా రాకపోకలకు ఇబ్బంది లేకుండా వంతెన నిర్మించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...