Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయాల్లో చంద్రబాబే 'విరాట్ కోహ్లీ': మంత్రి లోకేష్

Follow Udayam on Google
Suresh Jun 12, 2026 2:26 PM అమరావతిGeneral
రాజకీయాల్లో చంద్రబాబే 'విరాట్ కోహ్లీ': మంత్రి లోకేష్ - Udayam
రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు విరాట్ కోహ్లీ వంటివారని మంత్రి లోకేష్ కొనియాడారు. బౌలర్లు మారినా బ్యాటర్ మాత్రం ఆయనేనని, ప్రత్యర్థులు ఎవరైనా సరే చంద్రబాబు సిక్సర్లు కొట్టడం ఖాయమని లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన కూటమి విజయోత్సవ సభలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను 'రాయల్ సీమ'గా మారుస్తున్నది చంద్రబాబేనని లోకేష్ పేర్కొన్నారు. కియా, రాయల్ ఎన్ ఫీల్డ్ వంటి సంస్థలను తీసుకురావడంతో పాటు, హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా సీమకు సాగునీరు అందించి, లక్ష కోట్లతో 'మిషన్ రాయలసీమ'ను బాబు ప్రారంభించారని ఆయన వివరించారు.

Comments

G
Loading comments...