వార్తలకు తిరిగి వెళ్లండి

నీటిని పొదుపు చేయడం అలవాటుగా చేసుకోవాలని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ కోరారు. హర్ ఘర్ జల్ – జల్ అర్పణ్ దివస్ సందర్భంగా శుక్రవారం జన్నారం మండలంలోని ధర్మారం గ్రామ పంచాయతీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
భవిష్యత్ తరాల కోసం నీటిని కాపాడి కానుకగా అందిద్దామని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆత్రం గోదావరి , మిషన్ భగీరథ AEE నందన వర్మ , సెక్రటరీ జలంధర్ ఉన్నారు.
Comments
Loading comments...

