వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వరి సాగుపై ఉపాధ్యాయులు, రైతులు అవగాహన కల్పించారు. పాఠ్యాంశ ప్రణాళికలో భాగంగా గురువారం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామ శివారులోని పొలాల్లో పర్యటించారు. వారికి వరి, తదితర పంటల గురించి రైతులు వివరించారు.
దేశానికి వ్యవసాయమే ముఖ్య ఆధారమని, విద్యార్థులు చిన్నప్పటినుండే వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని ఉపాధ్యాయులు సతీష్ సూచించారు
Comments
Loading comments...

