వార్తలకు తిరిగి వెళ్లండి

కరవు పరిస్థితుల నేపథ్యంలో రైతుల ఇళ్లకు వెళ్లి పంట రుణాలు వసూలు చేయవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు, పరపతి సంఘాలను ఆదేశించింది. రుణ వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేసేలా ఆర్‌బీఐ సర్క్యులర్ జారీ చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను కోరింది.
రాష్ట్రంలోని 358 తాలూకాల్లో 265 చోట్ల తీవ్ర కరవు నెలకొందని ప్రభుత్వం తెలిపింది. మరో 43 తాలూకాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించేందుకు చర్యలు చేపట్టింది.
Comments
Loading comments...

