Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండగకు వెళ్లేవారు LHMS సేవలు వాడండి

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 11:12 AM అనకాపల్లి General
పండగకు వెళ్లేవారు LHMS సేవలు వాడండి - Udayam
దసరా పండగకు ఊర్లకు వెళ్లేవారు ఇళ్ల భద్రత కోసం లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌ (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) సేవలను వినియోగించుకోవాలని అడ్డరోడ్డు సీఐ రామకృష్ణ సూచించారు. ఈ సేవ ఉచితంగా అందుబాటులో ఉందని తెలిపారు. ఇంట్లో సెన్సార్ పరికరం ఏర్పాటు చేయడం ద్వారా దొంగలు ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందుతుందని చెప్పారు. ఏపీ పోలీస్ యాప్, వెబ్‌సైట్ లేదా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

Comments

G
Loading comments...