వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న పంచాయతీలకు సొంత భవనాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఎంపీడీవో ప్రసాద్ తెలిపారు.
శనివారం సాయంత్రం మండలంలోని కాసిపేట, దండేపల్లి గ్రామాలలో నిర్మాణంలో ఉన్న పంచాయతీ భవనాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. వర్షాలు పడుతున్న దుష్ట అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఉన్నారు.
Comments
Loading comments...

