వార్తలకు తిరిగి వెళ్లండి

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పుర్‌లో ‘భంగారం బిడాయి’ పేరుతో తరతరాలుగా ఓ సంప్రదాయం కొనసాగుతోంది. ప్రజల బాధలు, కష్టాలను భంగారం దేవుడు తన వెంట తీసుకెళ్లి శాంతి, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడని స్థానికుల విశ్వాసం.
ఐదు రోజుల ప్రత్యేక పూజల అనంతరం మొక్కులు, కానుకలను పల్లకిలో ఉంచి ఊరి పొలిమేర దాటిస్తారు. డప్పుల మోత మధ్య పల్లకిని తీసుకెళ్లి అక్కడే విడిచిపెడతామని దేవ్ కమిటీ తెలిపింది.
Comments
Loading comments...

