వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం కిష్టంపల్లిలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను శుక్రవారం కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రారంభించారు.
రూ.18 లక్షల నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో ఈ భవనాన్ని నిర్మించినట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు పొందేందుకు పల్లె దవాఖానలు దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

