Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్ రహిత మార్కెట్గా పాలకొండ

Follow Udayam on Google
B Ganga Sep 08, 2026 7:26 PM పార్వతీపురం మన్యంGeneral
ప్లాస్టిక్ రహిత మార్కెట్గా పాలకొండ - Udayam
మన మార్కెట్–మన బాధ్యత' కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి మంగళవారం పాలకొండ మార్కెట్లో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. షాపులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దసరా నాటికి దుకాణాలకు వైట్వాష్ వేయించాలని వర్తకులను ఆదేశించారు. ప్లాస్టిక్ గ్లాసులు, కప్పుల వినియోగాన్ని స్వచ్ఛందంగా నిలిపివేసిన వ్యాపారులను అభినందించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...