వార్తలకు తిరిగి వెళ్లండి

కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం వీధి ఎర్ర చెరువులో బుధవారం ప్రమాదవశాత్తు పడి అల్లం చిట్టి హేమసుందర్ (40) మృతి చెందాడు. చెరువులో మునిగిన హేమసుందర్‌ను బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

