వార్తలకు తిరిగి వెళ్లండి
భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కల్వకుర్తి మండలం బెక్కెర గ్రామంలో 'భూ భారతి' కింద జరుగుతున్న రీ సర్వేను ఆయన పరిశీలించారు.
రైతుల సమక్షంలోనే భూముల హద్దులు పరిశీలించాలని, డేటా నమోదులో తప్పులకు తావివ్వకుండా పారదర్శకత పాటించాలని ఆదేశించారు. రైతుల భూ హక్కులకు ఇబ్బంది కలగకుండా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
Comments
Loading comments...

