Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్ దరఖాస్తులకు సర్వర్ అడ్డంకులు.. ఆలస్యంగా నమోదు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 08, 2026 6:48 PM శ్రీకాకుళంGeneral
పింఛన్ దరఖాస్తులకు సర్వర్ అడ్డంకులు.. ఆలస్యంగా నమోదు - Udayam
​ఎన్టీఆర్ భద్రత పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులు అందిస్తున్న దరఖాస్తులు అప్‌లోడ్ చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని డిజిటల్ అసిస్టెంట్ జగదీష్ తెలిపారు. నరసన్నపేట మండలం ఉర్లాం సచివాలయంలో నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం నాటికి కేవలం 30 దరఖాస్తులు మాత్రమే అప్‌లోడ్ అయ్యాయని వివరించారు. లబ్ధిదారులు తరలివస్తున్నారు. ముఖ్యంగా ఓటీపీ సమస్య ఎక్కువగా వెంటాడుతుందన్నారు.

Comments

G
Loading comments...