వార్తలకు తిరిగి వెళ్లండి

స్పెయిన్ నుండి బర్మింగ్‌హామ్ వెళ్తున్న జెట్2 విమానం 30 వేల అడుగుల ఎత్తులో ఉండగా పైలట్‌కు గుండెపోటు వచ్చింది. దీనిని గమనించిన కో-పైలట్ వెంటనే అలర్ట్ అయి, విమానాన్ని పోర్చుగల్‌లోని ఫ్రాన్సిస్కో సా కార్నీరో ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
రన్‌వేపై విమానం దిగేసరికే ఎయిర్‌పోర్ట్ అధికారులు అత్యవసర వైద్య ఏర్పాట్లు పూర్తి చేసి, పైలట్‌కు తక్షణ చికిత్స అందించారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 220 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
Comments
Loading comments...

